Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నిహితులకు విజయ్ మాల్యా నుంచి ఖరీదైన బహుమతి!

బ్యాంకులకు దాదాపు రూ. 9 వేల కోట్లను ఎగ్గొట్టి ఇండియా నుంచి పారిపోయి, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా ఈ దీపావళి సందర్భంగా తన సన్నిహితులకు ఖరీదైన బహుమతిని పంపాడు. అదేంటో తెలుసా? బ్లాక్ లేబుల్ మద్యం. యూబీ గ్రూప్ లోగోతో కూడిన అందమైన బాక్సులో ఖరీదైన బ్లాక్ లేబుల్ మద్యం బాటిల్ ను పంపించాడు. మాల్యా పంపిన ఈ బహుమతులు దేశంలోని పలువురికి అందినట్టు సమాచారం. ఎన్నిసార్లు కోర్టులు ఆదేశించినా ఇండియాకు రావడానికి మాల్యా సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News